calender_icon.png 24 January, 2026 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా సన్నిధిలో బేతాల్

24-01-2026 12:00:00 AM

ఘనంగా మండ గాజుల పూజలు

గాల్లోకి ఎగురుతూ కర్రసాము నృత్యాలు

ఆలయంలో వసంత పంచమి పూజలు

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 23 (విజయక్రాంతి): నాగోబా జాతరలో భాగం గా ఆదివాసీలు చేసే పూజలు, ఆడే ఆటలు, చేసే నృత్యాలు అన్ని భిన్నంగా ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కెస్లాపూర్‌లో కొలువైన నాగోబా జాతర సందర్భంగా శుక్రవారంతో మెస్రం వంశీయులు తమ సంప్రదాయ పూజలు ముగిశాయి. ముగిం పు సందర్భంగా మెస్రం వంశీయులు ము ఖ్యంగా బేతాల్, మండ గాజులు పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. పూజల అనంతరం మెస్రం వంశస్థులు కొత్త కోడళ్ల ప్రత్యేక నృత్యాలు చేశారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మెస్రం వంశీయుల కర్రసాము నృత్యాలు ఆకట్టుకుంటాయి.

ఆలయ పీఠాధిపతి మెస్రం వెంక ట్రావుతో పాటు పటేళ్లు, పర్ధన్‌లు కర్ర సాము నృత్యం చేశారు. కర్రసాము నృత్యం సందర్భంగా మెస్రం వంశీయులు పొడువాటి కర్రను తిప్పుతూ గాల్లోకి ఎగురుతూ ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేసే నృ త్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సతీక్ దేవతల వద్ద గిరిజనులు కానుక రూపంలో వేసిన నగదు, పేలాలు (మురమురాలను) మెస్రం వంశస్తులకు ప్రసాదం గా అందజేశారు.

తరువాత నాగోబా దేవు డి మహా పూజలకు ఉపయోగించిన మట్టి కుండలను మెస్రం వంశంలోని 22 తెగల వారికి పంపిణీ చేశారు. అనంతరం మెస్రం వంశస్థులు ఎడ్లబండ్లలో ఉట్నూర్ మండలంలోని బుడుం దేవ్ పూజలకు బయలుదేరారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుం డి గిరిజనులు, గిరిజనేతలులు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ భక్తులతో కిక్కిరిసిపోయింది. నాగోబా దర్శనానికి మూడు గంటలకు పైగా సమ యం పట్టింది. కాగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగోబా ఆల యంలో వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెస్రం వంశపు మహిళలు సరస్వతీ దేవి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మెస్రం వంశం చిన్నారులకు అక్షరా భ్యాసం చేయించారు.