24-01-2026 12:00:00 AM
వనపర్తి జిల్లా అధ్యక్షుడిగావిజయ్ యాదవ్ నియామకం
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా టీఆర్పీ అధ్యక్షుడు డి విజయ్‌యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్పీలో భారీగా చేరికలు జరిగాయి. హైదరాబాదులో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్క బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఏకం కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
జిల్లా అధ్యక్షుడిగా డి (విజయుడు) విజయ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూజారి స్వామి, గోపాల్‌పేట మండల అధ్యక్షుడిగా దండు రాము లు, కొత్తకోట మండల అధ్యక్షుడిగా కురుమూర్తి నియామకమయ్యారు. ఈ కార్యక్ర మంలో టీఆర్పి రాష్ట్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్‌గౌడ్, మీదింటి శివవీరు, వెంకటేష్, రాము, శ్రీను, చరణ్, చిన్న, శివ, చంద్రయ్య పాల్గొన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా హన్వాడా మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వడ్తె మోహన్, ఈర్నాపాటి కిరణ్, ఆకువీటీ బాబు, కడావత్ సునీల్ ఉన్నారు.
మున్సిపోల్స్‌లో టీఆర్పీ సత్తా చాటుతాం
కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు గంగిపెళ్లి అరుణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్, జిల్లా లో హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణతో జిల్లాలో తమ నాయకత్వం పనిచేస్తుందన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు టీఆర్పీ పార్టీ కత్తెర గుర్తు కోసం పార్టీ జిల్లా కార్యాలయం కశ్మీర్ గడ్డ (సాయి షికార ప్లాజా షెటర్ నెం.14) లో జిల్లా కమిటీకి దరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర కమిటీ ఆమోదంతో జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ బీ-ఫామ్ అందజేస్తారని తెలిపారు. సమా వేశంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు వాజి ద్, టౌన్ ప్రెసిడెంట్ ఆర్షత్, ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, టౌన్ మహిళ అధ్యక్షురాలు జింక లావణ్య, సోషల్ మీడియా కన్వీనర్ మహబూబ్ అలీ, పార్టీ నాయకులు చిగుర్ల మోహన్, ఖాజా ఘోస్, కొత్తపెళ్లి శేఖర్, సయ్యద్ షాహిద్ హుస్సేన్, బోగ భాస్కర్ పాల్గొన్నారు.