calender_icon.png 21 January, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యానికి తావు లేదు

20-01-2026 12:00:00 AM

మహా మండపం పనులపై విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలు

వేములవాడ, జనవరి 19,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభి వృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో నిర్మాణంలో ఉన్న మహామండపం రాఫ్టింగ్ ఫౌండేషన్ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో విప్ సమీక్ష నిర్వహించారు.

నిర్దేశిత గడువులోపు పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచే సుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కాగా, సోమవారం సమ్మక్కసారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా వేముల వాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ విప్ను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్ విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.