ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా

28-04-2024 12:05:31 AM

l రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ ఇస్తా

l హామీలు అమలు చేసేవరకు పోరాటం ఆపం

l మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేట, ఏప్రిల్27(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేశారు. శనివారం సిద్దిపేటలో బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు పదవులు ఎన్నడూ ముఖ్యం కాదని, రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్పారు. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తే అసెంబ్లీ స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ పంపిస్తానని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, వివిధ మండలాల ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.