20-12-2025 12:00:00 AM
దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్‌లో రోడ్డును బాగు చేసిన నూతన సర్పంచ్
గజ్వేల్, డిసెంబర్19: సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి సర్పంచ్ గా గెలవడమే కాదు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయకముందే గ్రామ సమస్యలను పరిష్కరిస్తున్నారు. దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్( మాందాపూర్) గ్రామ సర్పంచ్ గా ఇటీవల ఎన్నికైన గంధం ముత్యాలు గ్రామంలోని రోడ్డును బాగు చేశారు. అయిదారేండ్లుగా గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
గెలిచిన వెంటనే గ్రామ సమస్యల పరిష్కారం లో భాగంగా సర్పంచ్ గంధం ముత్యాలు గత రెండు రోజుల నుండి రోడ్డును బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 100 ట్రాక్టర్లకు పైగా మట్టితో రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి వేసి చదును చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే పనిమంతుడుగా సర్పంచ్ నిరూపించుకోవడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.