రాఘవపేట గ్రామంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం
మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆశా వర్కర్లు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల నివారణ వంటి ముఖ్య అంశాలపై వివరించారు. ప్రత్యేకంగా సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రమైన త్రాగునీరు వినియోగించుకోవాలని, చెత్తను సక్రమంగా పారవేయాలని సూచించారు.
అలాగే ప్రతి కుటుంబం ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు వైద్య సేవలు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజల ఆరోగ్యం కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




