17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అటవీ గ్రామాల్లో ఆరోగ్య శిబిరం

12-06-2025 12:21 AM
  1. గిరిజనులకు ఆరోగ్యం పట్ల అవగాహన
  2. ఎంససీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్

చర్ల, జూన్ 11 (విజయక్రాంతి): చర్ల మండలంలోని అటవీ గ్రామాలలో యం.సి.హెచ్ ఆరో గ్యాధికారి డాక్టర్ సచిన్ ఆధ్వర్యంలో పుసుగుప్ప గ్రామంలో బుధవారం  ఆరోగ్య శిభిరం నిర్వహించారు. గిరిజనులకు ఆరోగ్యం పట్ల అవగాహన క లిగేలా ప్రత్యక్షంగా వివరించారు , అంగన్వాడీ సెంటర్‌లో జరుగుతున్న ఇమ్యూనిజేషన్ సెంటర్ ను సందర్శించి తగు సూచనలు , సలహాలు ఇచ్చారు.

ఈ నెల కాన్పుల తేదీ కి సిద్ధం గా ఉన్న గ ర్భిణీ స్త్రీ లను సందర్శించి ఆహారం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో లో సాధారణ కాన్పు వల్ల కలిగే ఉపయోగాలు వివరించి తగిన సూచనలు ఇచ్చారు.అనంతరం ప్రతి ఇంటిని సందర్శించి ఫ్రైడే డ్రై డే ప్రాముఖ్యతను వివరించారు.దోమలు వృత్తి చెందకుండ తీసుకోవలసిన జాగర్తలను గ్రామస్తులకు వివరించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని గిరిజన ఆదివాసీలకు తెలియజేశారు.ఈ కా ర్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రామ్ ప్రసాద్,యం.సి.హెచ్ స్టాఫ్ నర్స్ దీక్షిత, హెల్త్‌అసిస్టెంట్ నరసింహారావు,అన సూర్య, ఆశ కార్యకర్త లావణ్య,తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.