17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రామడుగు పోలీసుస్టేషన్ తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

12-06-2025 12:22 AM

చొప్పదండి, జూన్11(విజయక్రాంతి): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రామడుగు పోలీసుస్టేషన్ ను  బుధవారంనాడు క రీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తనిఖీ చే సారు..హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ మరియు లాఠీ పరేడ్ నిర్వహించిన తీరును పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం  పోలీస్  స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు.

పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్‌ఎస్ లో పొందుపరచాలన్నారు. పో లీసు స్టేషన్ కి కేటాయించబడిన వస్తువులను పరిశీలించారు. పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ను బ్లూ కోలట్స్ సిబ్బంది వినియోగించే తీరును పరిశీలించారు.

నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నే ర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్,రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నా రు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్త్స్ర రాజు లతో పాటు ఇతర అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.