calender_icon.png 25 May, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో ఆరోగ్యకరమైన జీవితం

25-05-2025 05:13:17 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చని యోగా గురువు డాక్టర్ జి వి ఎన్ చారి(Yoga guru Dr. GVN Chari) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ జివిఎన్ చారి నేతృత్వంలో నిర్వహించిన ఉచిత యోగ శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వెంకట్రెడ్డి, ముఖ్య సలహాదారుడు మైస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్, పగడయ్య, దేవేందర్ రెడ్డి, తోలం వెంకటేశ్వర్లు, నేతుల వెంకన్న, జిలకర శ్రీహరి, సజ్జనం వెంకటేశ్వర్లు, రాచకొండ ఉపేందర్, వోలం విద్యాసాగర్, సామ సత్యం, వేముల రవీందర్, బద్రు, శ్రీధర్, గోనే శ్యామ్ రావు, మేడ వెంకటేశ్వర్లు, గాయకులు మా ఊరు మల్లేష్, తోడేటి వెంకన్న, దేవ్ సింగ్, రాంబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు జీవీఎం చారిని సన్మానించారు.