calender_icon.png 26 May, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్ పోలీస్ లైన్ ఫ్రెండ్స్

25-05-2025 05:09:22 PM

ఆత్మీయ సమ్మేళనం సన్మానం..

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం (విజయక్రాంతి): ఓల్డ్ పోలీస్ లైన్ ఖమ్మం ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం శ్రీనివాస నగర్ బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. పెద్దలు మన నుంచి భౌతికంగా దూరం ఐన వారి ఆత్మ శాంతికి మౌనం పాటించి తరువాత రిటైర్ ఐన వారికి, ప్రమోషన్ పొందిన వారినీ సన్మానించారు. ఈ కార్యక్రమం జరుపుటకు కృషి చేసిన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు. ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఓల్డ్ పోలీస్ లైన్ ఫ్రెండ్స్ 200 కోటర్స్ లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలతో గ్రూప్ క్రియేట్ చేయడం ఈరోజు ఆత్మీయ మిత్రుల సమ్మేళనం, సన్మానం సీఐలు, ఎస్సైలకు  నిర్వహించారు.

ఈ సందర్భంగా పాత పోలీసుల మిత్రుల అందరూ కలిసి ఆనందంగా వారి వారి గత స్మృతులను మననం చేసుకున్నారు. ఈ గ్రూపు అందరిని  కలపటానికి ముఖ్యులు బోలె పాషా కాజా అలీ, నల్ల శ్రీనివాస్, సుజావుద్దీన్ గౌరవ అధ్యక్షులు రవికుమార్ రిటైర్డ్ అడిషనల్ డిసిపి ఉమా శంకర్ వీరి సారధ్యంలో సుమారు 300 మందితో గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరిగింది. ఈ గెట్ టుగెదర్ విచ్చేసిన గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసినారు.