24 March, 2026 | 11:30 AM

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణ వాయిదా

16-07-2024 01:04 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోరడంతో వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు.