calender_icon.png 8 October, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దున్న పోతుకు ఏం తెలుసు?’

08-10-2025 01:37:48 AM

అసలేం జరిగింది?

ఆ దున్నపోతుకు సమయం విలువంటే ఏంటో తెలియదు!

మనకు టైమ్, జీవితమంటే ఎంటో తెలుసు..

  1. మంత్రి వివేక్ వెంకటస్వామితో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ గుసగుసలు.. అనుచిత వ్యాఖ్యలు 
  2. వీడియోలో రికార్డు అయిన పొన్నం మాటలు
  3. మంత్రి శ్రీధర్‌బాబు కూడా అంతే.. సమయానికి రాడు..!
  4. లక్ష్మణ్ ఆయన శిష్యుడే కదా.. 
  5. మంత్రి పొన్నంతో మంత్రి వివేక్

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : చెడ్డ మాట చెవిలో చెప్పాలి.. మంచి మాట మైకులో చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచుగా చెబుతుంటారు. ఆయన మాటలు మంత్రివర్గ సహచరులు కొందరు విన్నట్టు లేదు. ఇద్దరు మంత్రులు బాహాటంగా.. మైకులోనే సహచర మంత్రులను తూలనాడుతూ మాట్లాడారు. వారి మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో కాక రేపుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య వివాదం పార్టీని రెండు గ్రూపులుగా చీల్చింది.

గత కొన్ని రోజులుగా మంత్రుల మధ్య ఉన్న మనస్పర్థలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకే జిల్లా కి సంబంధించిన మంత్రుల మధ్య ఆధిపత్య పోరు జూబ్లీహిల్స్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో బయపడింది. ఆదివారం జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనార్టీ శాఖ సమావేశం ఈ వివాదానికి వేదికైంది. ఆ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిధిగా రావాల్సి ఉంది. అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు రావడం కొంత ఆలస్యమైంది.

షెడ్యూల్ కంటే ముందే  మంత్రులు  పొన్నం ప్రభాకర్, వివేక్‌లు వచ్చారు. కార్యక్రమాన్ని ము గించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మైనార్టీకి సంబంధించిన నేతలు ఫోను చేయగా.. ‘నాకు రావడానికి కొంత సమ యం పడుతుంది.. అక్కడున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తనకు అభ్యంతరం లేదు..  చివరలో జాయిన్ అవుతా’నని మంత్రి అడ్లూరి చెప్పారు.

అదే సందర్భంలో పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్‌ను ఉద్దేశించి మరో మంత్రి వివేక్ చెవిలో దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. ‘మనకు టైం ఏమిటో తెలుసు. జీవితం అంటే ఏమిటో తెలుసు. వాడు ఒక దున్నపోతు .. సమయం విలువ వాడికేం తె లుసు. తిని పడుకోవడం తప్ప’ అని వివేక్  చెవిలో మంత్రి పొన్నం ప్రభాకర్ గుసగుసలాడాడు. అదే సమయంలో వివేక్ కూడా శ్రీధర్‌బాబుపైన అనుచిత వ్యాఖ్యలు చేశా రు. ‘శ్రీధర్‌బాబు కూడా సమయానికి రాడు..

లక్ష్మన్ ఆయన శిశ్యుడే కదా..?’ అన్నా రు. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన తనపై మీడియా ముందు కా మెంట్ చేయడంతో  లక్ష్మణ్‌కుమార్ నొచ్చుకున్నారు. ఆయన సన్నిహి తులు బహిరం గంగానే మంత్రి పొన్నంపై మండిపడుతున్నారు. దీంతో వివాదం మరింత ముదురు తుందని  భావించిన లక్ష్మణ్.. తన అనుచరులను ఆందోళన వద్దని వారించారు.