calender_icon.png 15 February, 2026 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండె వ్యాధి రోగికి కేర్ హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స

15-02-2026 12:00:00 AM

47 ఏళ్ల ఐవీఎఫ్ గర్భిణికి సురక్షిత ప్రసవం

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): తీవ్రమైన రుమాటిక్ గుండె వ్యాధి తో బాధపడుతున్న 47 ఏళ్ల ఐవీఎఫ్ గర్భిణికి హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ వైద్యు లు విజయవంతంగా సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించి తల్లిశిశువులను సురక్షితంగా కాపాడారు. వైద్యపరంగా అత్యంత క్లిష్టంగా పరిగణించబడే ఈ కేసు బహుళ వైద్య విభాగాల సమన్వయంతో సఫలమైంది.శాలిని (పేరు మార్చబడింది), 47 ఏళ్ల మహిళ, గర్భధారణ 31 వారాలు 3 రోజుల సమయంలో తీవ్రమైన శ్వాస ఇబ్బందులు, రెండు రోజులుగా తగ్గని దగ్గుతో అత్యవసర విభాగానికి చేరుకున్నారు.

ఇది ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయని ఐవీఎఫ్ గర్భధారణ. గతంలో సిజేరియన్ శస్త్రచికిత్స చేయించుకోవడం, బీటా థలసీమియా ట్రైట్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉండటంతో పరిస్థితి మ రింత సంక్లిష్టమైంది. వైద్యులు అనుమానం వ్యక్తం చేసి 2డీ ఈకో పరీక్ష నిర్వహించగా క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ తో పాటు తీవ్రమైన మైట్రల్ స్టెనోసిస్ ఉన్నట్లు తేలింది. ఇతర గుండె వాల్వులపై స్వల్ప ప్రభావం, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ కూడా గుర్తించారు.

రోగిని వెంటనే క్రిటికల్ కేర్ విభాగానికి తరలించి మందుల ద్వారా గుం డె స్పందన నియంత్రణ, డయూరెటిక్స్, రక్త మార్పిడి వంటి చికిత్సలతో స్థిరీకరించారు. కార్డియాలజీ, ప్రసూతి, అనస్థీషియా, క్రిటికల్ కేర్, న్యోనటాలజీ నిపుణులతో కూడిన బృందం సమన్వయంతో చికిత్స కొనసాగించారు. తల్లి ఆరోగ్యాన్ని కాపాడుతూ, శిశువు అభివృద్ధి మెరుగుపడేలా గర్భధారణను సాధ్యమైనంత వరకు కొనసాగించారు.31 వారాల నుంచి దాదాపు 35 వారాల వరకు గర్భధారణను జాగ్రత్తగా కొనసాగించారు.

శిశువు ఊపిరితిత్తుల అభివృద్ధికి స్టెరాయిడ్లు ఇచ్చి, గుండె స్పందనను నిరంతరం పర్యవేక్షించారు. సమగ్ర ప్రణాళికతో 34 వారాలు 4 రోజులకు లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ నిర్వహించారు. గుండెపై ఒత్తిడి తగ్గించే విధంగా కాంబైన్డ్ స్పునల్‌ఎపిడ్యూరల్ అనస్థీషియా వినియోగించారు. శస్త్రచికిత్స విజయ వంతంగా పూర్తి అయింది.శిశువు ముందస్తు జననం అయినప్పటికీ పుట్టగానే ఏడ్చింది. 45 రోజులు ఎన్‌ఐసీయూలో పర్యవేక్షణ అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ అభినయ అల్లూరి , సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి ,గైనకాలజీ, లాప రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ నిపుణురాలు, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ మాట్లాడుతూ రోగి వయస్సు ఎక్కువగా ఉండటం, ఐవీఎఫ్ గర్భధారణ ఉండటం వల్ల ప్రమాదం మరిం త పెరిగింది. ప్రారంభ దశలో అనుమానం, వెంటనే గుండె పరీక్షలు, బృంద సమన్వయం వల్ల తల్లి-శిశువులకు సురక్షిత ఫలితం సాధ్యమైందన్నారు.

డాక్టర్ ఆశుతోష్ కుమా ర్, క్లినికల్ డైరెక్టర్ కార్డియాలజీ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ మాట్లాడుతూ రోగి అత్యంత సంక్షోభ స్థితిలో వచ్చినప్పటికీ, సమయానుకూల జోక్యం, బృంద కృషితో సురక్షిత ప్రసవం సాధ్యమైందని తెలిపారు. కార్యక్ర మంలో డాక్టర్ రాహుల్ అగర్వాల్ (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్  క్లినికల్ డైరెక్టర్ ఇంటర్నల్ మెడిసిన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్,  డాక్టర్ కె. శైలజ (సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ), డాక్టర్ శైలజ (సీనియర్ కన్సల్టెంట్  అనస్థీషియాలజీ), డాక్టర్ ప్రియాంక రెడ్డి నాగరడోన (కన్సల్టెంట్  పీడియాట్రిక్స్)తో పాటు కార్డియాలజీ, ప్రసూతి సిబ్బంది తదితరులు  ఉన్నారు.