28 April, 2026 | 5:02 PM

Breaking News

అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •   కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు   •  

ఢిల్లీలో భారీగా పట్టుబడిన డ్రగ్స్

03-10-2024 02:57 AM

500 కిలోల కొకైన్ l మార్కెట్‌లో విలువ 2 వేల కోట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరం చరిత్రలోనే అత్యధికంగా ఒకేసారి 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని పోలీసు లు తెలిపారు.

దక్షిణ ఢిల్లీలో భారీ డ్రగ్స్ దందా నడుస్తున్నదన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులకు పెద్దపెద్ద బస్తాల్లో నిలువ ఉంచిన 500 కిలోల కొకైన్ లభ్యమైంది. దీనిని స్మగ్లిం గ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసు లు అరెస్టు చేశారు. ఇంత భారీ మొత్తం లో కొకైన్‌ను ఎక్కడి నుంచి తెచ్చారన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు.