calender_icon.png 12 August, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

21-09-2024 01:46:35 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాం తాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడడంతో పాటు సాయంత్రం 7 గంటలకు ఉప్పల్, నాగోల్, ఎల్‌బీ నగర్, మేడిపల్లి, హబ్సీగూడ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, రామంతాపూర్, నాచారం, పేట్‌బషీరాబాద్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, మలక్‌పేట్, నాగారం, సైదాబాద్, చంపాపేట్, బాలానగర్, జీడిమెట్ల, సూరారం, సుచిత్ర, అబిడ్స్, తార్నాక, ఓయూ, లాలాపేట్, బడంగ్‌పేట్, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో సుమారు గంటసేపు వర్షం దంచికొట్టింది.