12 June, 2026 | 1:21 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి

19-03-2026 02:27 AM
  1. గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నిరసన
  2. మక్కజొన్న కంకులతో అసెంబ్లీకి పాదయాత్ర

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని, బోనస్ రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసన వ్యక్తంచేశా రు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం గన్‌పార్క్ వద్ద మక్కజొన్న కంకులు పట్టుకొని నినాదాలుచేశారు.

అనంతరం అసెంబ్లీకి వస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులను ఎంట్రీ పాయింట్స్ వద్ద మార్షల్స్, పోలీసులు అడ్డుకొని వారి చేతిలో ఉన్న మక్కజొన్న కంకులను లాక్కున్నారు. హరీశ్‌రావు చేతికి గాయమై రక్తం వచ్చింది. దీంతో మార్షల్స్ తీరుపై హరీశ్‌రావు, మిగతా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ద్వారం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేసి సభలోకి వెళ్లారు.

ఈ సంద ర్భంగా గన్‌పార్క్ వద్ద హరీశ్‌రావు మా ట్లాడుతూ.. వరి వేయొద్దని, పంట మార్పి డి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు పదేపదే చెబితే.. ఆ మాటలు నమ్మి రాష్ట్రంలో రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేసి మోసపో యారని తెలిపారు. మక్కజొన్న వేసి పంట చేతికి వచ్చాక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందన్నారు.

మక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉంటే.. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట మార్కెట్‌లో దళారులకు రూ.1,600 నుంచి 1,700లకే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని, పది హేను రోజులుగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఆం తర్యం ఏమిటో అర్థమవుతోందన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదని, ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప, ఇప్పటివరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను విడుదల చేయడం లేదన్నారు.