18 April, 2026 | 5:09 PM

సాదాసీదాగా జెడ్పీ సర్వసభ్య సమావేశం

28-06-2024 01:33 AM

పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీమంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెలు, ఎమ్మెల్సీలు

చివరి సమావేశం కావడంతో జెడ్పీటీసీలు, ఎంపీపీలకు సన్మానం 

సిద్దిపేట అర్బన్, జూన్ 27: జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ అధ్యక్షతన గురు వారం జరిగిన సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. చివరి సమావేశం కావడంతో అత్యంత ఆసక్తికరంగా సాగుతుం దనుకున్న సభ్యుల ఆశలు తారుమారయ్యాయి. ఆరు నెలల క్రితం వరకు అధి కారంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, నేడు ప్రతిపక్ష పాత్రలో కూర్చో వడంతో ప్రశ్నల వర్షం కురుస్తుందని సమావేశానికి ముందు సభ్యులందరూ చర్చించుకున్నారు. కొంతమేరకు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించినప్పటికీ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలస్యంగా రావడంతో ప్రశ్నలను పట్టించుకోకుండా ప్రసంగించడంతో సమావేశం చప్పగా ముగిసిందనే గుసగుసలు వినబడ్డాయి.

సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పదవిలో లేకున్నా ప్రజా సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాగా, సమావేశంలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై గళం విప్పారు. రాష్ట్రం లో అత్యధికంగా విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందం టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను బకాయిదారులుగా చూపించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లించా ల్సిన బకాయిలకు ప్రజలను బాధ్యులుగా చిత్రీకరించారంటూ ఆరోపించారు.

అదే విధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు బీఆర్‌ఎస్ హయాంలో చెట్లను నాటి పెంచిపెద్ద చేస్తే, నేడు విద్యుత్తు అధికారులు వాటిని కొట్టేయడం బాధాకరంగా ఉందని, చెట్లను రక్షించే ప్రయత్నం చేయాలని కోరారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రొటోకాల్ పాటించకుం డా అధికారం లేనివారు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, జెడ్పీ సర్వసభ సమావేశం చివరిది కావడంతో జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు సన్మా నాలు నిర్వహించి జ్ఞాపికలు అందజేశా రు. సమావేశంలో ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌తో పాటు నరోత్తం రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.