13-10-2025 01:08:32 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): పిల్లలను పోలియో నుండి రక్షించడానికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి వేయించాలని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ 16వ వార్డు బస్తీ దవాఖానలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్ 0.5 చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్స్ పోలియో అనేది పోలియో వైరస్‌తో పోరాడటానికి మరియు పిల్లలను పోలియో నుండి రక్షించడానికి భారతదేశంలో అమలు చేయబడిన ఒక రోగనిరోధక కార్యక్రమం అన్నారు. ఈకార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా వ్యాధి నిరోధకతను పెంచుతుందన్నారు. పోలియోవైరస్ వ్యాప్తిని అరికట్టడం మరియు చివరికి దానిని పూర్తిగా నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం అని తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యులు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.