13-10-2025 01:09:06 PM
బాసర రోడ్డుపై రైతులు రాస్తారోకో
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad district) గోదావరి వరద ముంపు బాధితులు సోమవారం ఆందోళనకు దిగారు. నవీపేట మండలం(Navipet Mandal) యంచ వద్ద 10 గ్రామాల రైతులు ధర్నా చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాసర రోడ్డుపై బైఠాయించిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత రెండు నెలల నుంచి కురిసిన అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారని రైతులు వాపోయారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేక, నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితి లేదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందింకపోతే కలెక్టరేట్, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని రైతులు హెచ్చరించారు.