calender_icon.png 13 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెత్తకుండీల నుండి చెత్తను తొలగించేది ఎప్పుడు..?

13-10-2025 01:02:23 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని లంబాడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్తను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు విన్నపించిన నెల రోజుల నుండి చెత్త కుండి నుండి చేత్తను తీపించడం లేదని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.

ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు, ప్రయాణికులు తెలుపుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అధికారులు చెప్పడానికి బాగానే ఉంది కానీ అధికారులు పరిశుభ్రతపై  నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తకుండీలలో రహదారి పక్కన పడివేసి ఉన్న చెత్తను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.