13-10-2025 12:50:50 PM
హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్‌ఎస్‌ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి(Konda Lakshma Reddy passes away) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. సీనియర్ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సంతాపం తెలిపారు. ప్రజాసేవలో వారిది సుదీర్ఘ ప్రస్థానమని స్మరించుకున్నారు. జర్నలిజంపై ఆసక్తితో NSS వార్తా సంస్థను స్థాపించిన లక్ష్మారెడ్డి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కూడా సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు. కొండా లక్ష్మారెడ్డి(Konda Lakshma Reddy) ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud), మంత్రులు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సంతాపం తెలిపారు.