వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు
ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ
హైదరాబాద్, జూన్ 18 ( విజయక్రాంతి) : తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కోస్తాం ధ్రను ఆనుకుని పశ్చిమ మధ్యబంగాఖాతంలో, అలాగే రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొంది. గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్రవరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు,పడమర ద్రోణి బలహీన పడిందని తెలిపింది. వీటి ప్రభావంతో వచ్చే 5 రోజుల్లో ఒక మోస్త రు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూ బాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షా లతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.






