20-07-2025 01:29:53 PM
హైదరాబాద్: ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆదివారం ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వేడుకల సందర్భంగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు రూ.1 కోటి నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ కు రూ.1 కోటి ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
పాతబస్తీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రపంచ వేదికపై తెలుగు పాటకు ఖ్యాతిని తీసుకొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ కి కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ గారి పేరును ప్రస్తావిస్తూ త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. తన మాట నిలబెట్టుకుంటూ, ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్‌ను రూ.1 కోటి నజరానాతో సత్కరించింది.
సీఎం రేవంత్‌ని కలిసిన నటుడు దుల్కర్ సల్మాన్
నటుడు దుల్కర్ సల్మాన్ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.