6 April, 2026 | 2:43 AM

సీఎం పర్యటనకు భారీ భద్రత

06-04-2026 12:13 AM

ఎస్పీ జానకి షర్మిల 

భైంసా/నిర్మల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో పోలీస్ పరంగా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బాసరలో భద్రత ఏర్పాట్లపై పోలీసుల అధికారులతో సమావేశం నిర్వహించారు. 500 మంది ప్రత్యేక పోలీసులతో భద్రత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీసీ కెమెరా డోన్ కెమెరా పర్యవేక్షణలో భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు ఉపేందర్ రెడ్డి సాయికుమార్ స్థానిక పోలీసులు పాల్గొన్నారు

ఖానాపూర్ ఎన్నిక ప్రశాంతం 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎన్నిక సందర్భంగా పోలీస్ శాఖ సివంగి దళంతో రక్షణ దళంతో బందోబస్తు నిర్వహించి నట్టు తెలిపారు. ఖానాపూర్ లో పోలీస్ అనుమతి లేకుండా సంబరాలు నిర్వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి సాయికిరణ్ సేలు ఎస్సైలు ఉన్నారు.