12 May, 2026 | 8:30 AM

గణేష్ నిమజ్జన ఊరేగింపు.. నగరంలో భారీ బందోబస్తు

03-09-2025 07:03 PM

హైదరాబాద్: బాలాపూర్ నుండి ట్యాంక్ బండ్ వరకు గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాన్ని బుధవారం అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CP CV Anand), హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana), హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తదితరులు ఉన్నారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ... నగరంలో విద్యుత్ షాక్ కారణంగా మరణాలు సంభవించిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని గణేష్ విగ్రహ నిర్వాహకులకు సూచించారు. రాబోయే రోజుల్లో ఊరేగింపులు సజావుగా సాగేందుకు పోలీసులు, సంబంధిత విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయని ఆయన పేర్కొన్నారు. “చివరి రోజున, దాదాపు 50,000 విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసే అవకాశం ఉందని.. నిమజ్జనానికి వీలుగా ట్యాంక్ బండ్ చుట్టూ తగినన్ని క్రేన్లను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులు గణేష్ నిమజ్జన ఊరేగింపు బందోబస్తు కోసం 29,000 మంది సిబ్బందిని నియమించారని, వారు మూడు షిఫ్టులలో పనిచేస్తారని వెల్లడించారు.