09-12-2025 12:39:04 AM
నేటితో మొదటి విడత ప్రచారానికి తెర
11న ఎన్నికలు
కరీంనగర్, డిసెంబరు 8(విజయక్రాంతి): పల్లెల్లో పంచాయతీ సమరం హోరాహోరీగా సాగుతోంది. నాయకులు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయ చదరంగంలో మునిగిపో యారు. మొదటి విడతలో 20 స్థానాలు ఏకగ్రీవం కాగా ఉమ్మడి కరింనగర్ జిల్లలో మి గిలిన 378 సర్పంచ్ స్థానాలకు 1153 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 150 స్థానా ల్లో ఉప సర్పంచ్ పై దృష్టి సారించారు. మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం తో ముగియనుంది.
ఎన్నో ఏళ్లుగా సర్పంచి కావాలని కలలుగన్న ఎందరో ఆశావహుల ఆశలపై ఈసారి రిజర్వేషన్ లు నీళ్లు చల్లినట్లయింది. అయినా చాలామంది వెనక్కి తగ్గలేదు ముందు వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాని బలమైన నా యకులు తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. సర్పంచి పదవి తమకు దక్కనప్పుడు, తమకు అత్యంత విధేయులుగా ఉండే అనుచరులను లేదా వారి సతీమణులను రిజర్వే షన్ కేటగిరీకి అనుగుణంగా బరిలోకి దిం చారు.
తాము మాత్రం ఏదో ఒక వార్డు నుం చి సభ్యుడిగా పోటీ చేసి, గెలిచిన తర్వాత ఉప సర్పంచి పీఠాన్ని అధిరోహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సర్పంచి నామమాత్రంగా ఉన్నా, చెక్ పవర్తో గ్రామంపై పూర్తి పెత్తనం తమ చేతిలోనే ఉంచుకోవాలన్నది వారి అసలు ప్రణాళిక. ఇందుకోసం సర్పంచి అభ్యర్థి నుంచి వార్డు సభ్యుల వర కు గెలిపించికోవాలని రాత్రింబవళ్లు తలమునకలవు తున్నారు.
సర్పంచిగా పోటీ చేసే త మ అనుచరుడికి అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తాన్ని ఈ ఉప సర్పంచి ఆశావహులే భరిస్తున్నారు. పట్టణాలకు దగ్గర్లోని గ్రామా ల్లో కోటి నుండి 50 లక్షల రూపాయల వరకు, మారుమూల పల్లెల్లో కనీసం 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని తామే మోస్తూ, గెలిచాక పంచాయతీలో జరిగే పనుల కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలు తమకే అప్పగించాలని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఉప సర్పంచి ఎన్నిక పూర్తిగా వార్డు సభ్యుల మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే బరిలో ఉండే నాయకులు తమకు అనుకూలమైన వార్డు సభ్యులను గెలిపించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. చాలా చోట్ల తమ మాట వినేవారినే వార్డు సభ్యులుగా నిలబెట్టి, వారి నామినేషన్ పత్రాల నుంచి పన్నుల చెల్లింపు వరకు అన్ని వ్యవహారాలను తామే దగ్గరుండి చూసుకున్నారు.
చాలా గ్రామాల్లో ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందోవేచిచూడాలి.