21 April, 2026 | 6:08 PM

Breaking News

నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •  

పుణెలో కుప్పకూలిన హెలికాఫ్టర్

25-08-2024 12:46 AM

ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన

పైలెట్‌కు తీవ్ర గాయాలు, మిగితా ప్రయాణికులు సేఫ్

పుణె (మహారాష్ట్ర), ఆగస్టు 24: మహారాష్ట్రలోని పుణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్ శనివారం కుప్పకూలిపోయింది. పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. పైలెట్ సహా నలుగురు ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్ శనివారం ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా పుణె సమీపంలోని పౌద్ సమీపంలో కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అయితే హెలికాఫ్టర్ పైలెట్ తీవ్రంగా గాయపడగా మిగితా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా తెలిపారు. శనివారం పుణెలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.