31-07-2025 12:00:00 AM
కొత్తపల్లి, జులై 30(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీ ధర్ ఆధ్వర్యంలో ము కరంపురలోని మహాత్మజ్యోతిబాపూలే మైదానంలో బుధవారం హలో బిసి చలో గోవా పోస్టర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ మేమెంతో మాకంత అనే నినాదంతో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిద్దాం అని బీసీ రిజర్వేషన్ల ఆరాధ్యులు బీపీ మండల్ ఆగస్టు 7న జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బిపి మండల్ డే ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని , ఈసారి ఆయన జయంతిని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం గోవా యూనివర్సిటీ దగ్గర సాంటాక్రోచ్ గోవాలో అఖిలభారత జాతీయ ఓబీసీ పదవ మహాసభను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్నట్లు తెలిపారు .
ఓబిసి మహాసభ విజయవంతం చేయాలని 42 శాతం అసెంబ్లీలో ఆమోదప్ప పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేం ద్రం 9వ షెడ్యూల్లో చేర్చి తెలంగాణ బీసీలకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్లతో జాతీయ ఓబీసీ మహాసభలో అనేక తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సం క్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు , బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నా రోజు రాకేష్ చారి , యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ , రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ , బియ్యని తిరుపతి బోయిని ప్రశాంత్, జ్యోతి, శ్రావణి, అరుణ , తిరు మల, రాజ్ కుమార్ , గుమ్మడి శ్రీనివాస్, కుసుంబా ఆదర్శ్, చింటూ, దుప్పటపల్లి మురళి తో పాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.