30-07-2025 11:29:40 PM
మునగాల సీఐ రామకృష్ణారెడ్డి..
మోతే (విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి(CI Ramakrishna Reddy) అన్నారు. బుధవారం మోతే మండల పరిధిలోని రాంపురం తండా గ్రామంలో నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేటి యువత, గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, సోషల్ మీడియా ద్వారా కలుగుతున్న మోసాలకు బలి అయ్యే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. డ్రగ్స్ ఆన్లైన్ మోసాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాల గురించి ఆయన వివరించారు. నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన యువతలో నైతిక విలువలు, భద్రతపై జాగ్రత్తలు పెంచుతాయని ఆయన అన్నారు. సైబర్ నేరాలపై1930 లేదా సైబర్ సెల్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతే ఎస్సై టి అజయ్ కుమార్, జిల్లా ఎస్టీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు కోర్ర రాములు నాయక్, మండల నాయకుడు ఆంగోతు బాలాజీ నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు లక్ముడు, ఆంగోతు మోహన్, బానోతు రమేష్, ఆంగోతు రాందాస్ ఆంగోతు సేవల్, తదితరులు పాల్గొన్నారు.