calender_icon.png 2 August, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్జి శ్రీదేవిని సన్మానించిన బార్ అసోసియేషన్

31-07-2025 12:00:00 AM

అర్మూర్ జులై 30  (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్ ఆఫీసర్స్ ఎన్నికలలో సంయుక్త కార్యదర్శిగా  ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి పోటీ చేసి గెలిచినందుకు బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  సన్మానించారు. జూనియర్ సివిల్ జడ్జ్ సరళ రాణి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ బార్ హాల్ నందు ఘనంగా శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాభినందనలు తెలియజేయడమైనది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు  జక్కుల శ్రీధర్ మాట్లాడుతూ ఆర్మూర్ బార్ సీనియర్ సివిల్ జడ్జ్ పీ.శ్రీదేవి ఆర్మూర్ న్యాయస్థానం నుండి రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్ ఆఫీసర్స్ ఎన్నికలలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికవడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో అధ్యక్షులుగా కూడా గెలవాలని ఆకాంక్షించారు. 

అదికూడా ఆర్మూర్ లో విధులు నిర్వహిస్తున్నప్పుడే  నియామకం కావాలని ఆకాంక్షించారు.   తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్  ఆఫీసర్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జ్ పి.శ్రీదేవి  మాట్లాడుతూ తనను ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు ఆర్మూర్ బార్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు.   

బార్ అసోసియేషన్ ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, కోశాధికారి గజ్జల చైతన్య, కార్యదర్శి కుందారం శ్రావణ్ సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.