మానవత్వం పరిమళించిన వేళ
ఖానాపూర్,(విజయక్రాంతి): ఎవరికైనా కష్టం వస్తే మాకు ఏంటి అని వదిలి వెళ్లే ఈ కాలంలో కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎవరు పట్టించుకోని స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని ఆదరించి, అంబులెన్స్ లో ఎక్కించి, ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చిన వైనం ఇది. గురువారం రాత్రి జాములో ఖానాపూర్ మండలం(Khanapur Mandal) మస్కాపూర్ అర్బన్ పార్క్ వద్ద గుర్తు తెలియని వాహనం ఒక వ్రద్ధుడిని ఢీ కొట్టి వెళ్లిపోగా, అప్పటినుంచి రోడ్డు పక్కన పడి ఉన్న అతనిని ఎవరు ఆదరించలేని పరిస్థితిలో పడి ఉన్న అతనిని గమనించిన స్థానిక ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అఖిల్, జనరల్ సెక్రటరీ అప్సర్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బాబర్ లు స్పందించి, 108 అంబులెన్స్ ను పిలిపించి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐకి సమాచారం అందించినట్లు వారు తెలిపారు.






