calender_icon.png 26 June, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాలు వద్దు.. జీవితం ముద్దు: మంత్రి సీతక్క

26-06-2025 02:12:41 PM

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని జెండా ఊపి ర్యాలీ నిర్వహించిన మంత్రి సీతక్క 

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలోని తంగేడు మైదానంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంనకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ముఖ్య అతిథిగా పాల్గొని,తంగేడు మైదానం వద్ద ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ర్యాలీ డి ఎల్ ఆర్ గార్డెన్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్,ఎస్ పి షబరిష్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి,అదనపు ఎస్ పి సదానందం,గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్,సంబంధిత అధికారులు,యువత,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.