calender_icon.png 2 December, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు చేయూతనందిస్తా

02-12-2025 10:05:29 PM

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.. 

వెల్దండ: చదువుల్లో రాణించేందుకు పేదరికం అడ్డు రావద్దని అలాంటివారిని ప్రోత్సహించేందుకు అన్నవిధాల సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండ మండలం కేంద్రానికి చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండటంతో అతనికి ల్యాప్‌టాప్ బహుకరించి మాట్లాడారు. చదువుల్లో రాణించేందుకు ఎవరికైనా తనవంతు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తానని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యనభ్యసించిమంచి గుర్తింపు పొందాలని సూచించారు.