calender_icon.png 2 December, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాపై కొండాపూర్ పోలీసుల హెచ్చరిక

02-12-2025 09:38:57 PM

కొండాపూర్: సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత, వర్గ వైషమ్యాలు రేకెత్తించే వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు పెడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొండాపూర్ ఎస్సై సోమేశ్వరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గ్రూప్స్ లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల కోసం ప్రజలందరూ సహకరించాలని ప్రకటనలో ఎస్సై సోమేశ్వరి సూచించారు.