calender_icon.png 20 July, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు దుల్కర్ సల్మాన్

20-07-2025 12:56:37 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటులు ఆదివారం కలిశారు. మలయాళ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్, సినీ నిర్మాత సప్న దత్ తో పాటు పలువురు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 

మలయాళంలో గుర్తింపు పొందిన హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. మహానటి చిత్రంతో తెలుగులో రంగప్రవేశం చేసిన ఆయన 'సీతరామం'తో మంచి హిట్ అందుకొని, 'లక్కీ భాస్కర్'తో ఊహించని విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలోనూ, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'కాంత'. ఇది 1950 నాటి కాలక్రమాన్ని ఆధారంగా తీసుకొని నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రాలు పోషిస్తున్నారు.