calender_icon.png 20 July, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న భట్టి విక్రమార్క

20-07-2025 01:15:33 PM

హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలో బోనాల పండుగ ప్రశాంతంగా జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలో అనాదిగా బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఈ ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతుందని చెప్పారు. దీంతో ఇవాళ ప్రభుత్వం తరపున భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భట్టిని ఘనంగా సత్కరించారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.1290 కోట్లు, బోనాలకు ప్రత్యేకంగా రూ.20 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.