8 August, 2026 | 1:17 AM

ఈ నెలాఖరున హాయ్

08-08-2026 12:00 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ తొలి సారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్’ కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు దర్శకత్వంలో తెర కెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయ నతార, విఘ్నేష్ శివన్, ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

కే భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేశ్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో ప్రధాన పాత్రధారులు నయనతార, కవిన్ ఆకట్టుకుంటున్నారు. ఇదొక సింపుల్, హార్ట్‌వార్మింగ్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు విష్ణు తెలిపారు. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యాల్లో సాగే సినిమా అని పేర్కొన్నారు. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రమణ్యం’, ‘యారాడి నీ మోహిని’ వంటి చిత్రాల తరహాలో బంధాలు, భావోద్వేగాలు, హాస్యంతో సాగే కథ ఇదని చెప్పారు.

గేయ రచయితగా ఇప్పటికే ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కలిసి పనిచేసిన విష్ణుకు ఇది దర్శకుడిగా తొలి చిత్రం. నయనతార ఫస్ట్ టైమ్ ఆన్‌స్క్రీన్ జోడీ కావడంతో అటు ప్రేక్షకుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి రాజేశ్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిం చగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూర్చా రు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్ కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.