పళ్ళ బురుసు కేసుతో ఆ తండ్రి సాధించిందేంటి?
సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటించిన కొత్త సినిమా ‘పళ్ళ బురుసు’. ఈ కుటుంబ కథాచిత్రానికి ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ పతాకాలపై ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని ఈ మూవీ ట్రైలర్‌ను డిజిటల్‌గా లాంచ్ చేశారు.
అంతకుముందు ఈ ట్రైలర్‌ను సిద్ధిపేట జిల్లా దుబ్బాక మం డలం లచ్చపేట గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున ఆ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను సైతం ప్రదర్శించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో లచ్చపేటలో సందడి వాతావరణం నెలకొంది.
కథలోని ప్రధాన సంఘర్షణను పూర్తిగా బయటపెట్టకుండా, పళ్ళ బురుసు కేసు వెనుక అసలు కారణమేంటి? తండ్రి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లో రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. వినోదంతోపాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను పంచేందుకు ఈ సినిమా ప్రేక్షకులకు రాబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వినోద్ కే బంగారి బాధ్యతలు నిర్వర్తించగా, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చారు.






