8 August, 2026 | 2:26 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుడా చైర్మన్

08-08-2026 01:16 AM

వైరా, ఖమ్మం, ఆగస్టు 7, (విజయక్రాంతి): తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కాలినడకన చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి లలిత, కుమార్తెలు గాయత్రి, చందనతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సుడా చైర్మన్  పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తన సతీమణి  ఇందుమతి తో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు సుభిక్షంగా జీవించాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే వైరా నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం మరింత సేవ చేసే శక్తి, అవకాశాన్ని ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో వైరా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు.