8 August, 2026 | 2:29 AM

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి

08-08-2026 01:17 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

తొమ్మిది నెలలుగా నిలిచిన పనులు 

అధికారులు, కాంట్రాక్టర్ పనితీరుపై ఆగ్రహం 

ఎల్బీనగర్, ఆగస్టు 7: రోడ్డు పనులు అ సంపూర్తిగా ఉండడంపై అధికారులు, కాం ట్రాక్టర్ పనితీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలలుగా ఎం దుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించా రు. చింతలకుంట డివిజన్ ఆర్టీసీ కాలనీ రోడ్డు పనులను శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మె ల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు.

ఆర్టీసీ కాలనీలో తొమ్మిది నెలలుగా రోడ్డు నిర్మా ణ పనులు నిలిచిపోవడంతో దాదాపు పది కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జం ఘీర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు నుంచి మ జీదు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ, మజీదు నుంచి ఎఫ్సీఐ కాలనీ జీమాట్ మీదుగా పద్మావతి కాలనీ వరకు రోడ్డు ని ర్మాణ పనులు నిలిచిపోయాయని, దీంతో తీ వ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే  ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులు, ఇంజనీర్ దామోదర్, విఘ్నేశ్వరి, కాంట్రాక్టర్తో మాట్లాడి పెం డింగ్లో ఉన్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇ బ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా స మస్యను పరిష్కరించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కా ర్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ డి విజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, ఉపాధక్షులు లగ్గొని శ్రీధర్ గౌడ్, ఆర్టీసీ కాలనీ అధ్యక్షుడు ముకుంద్ రాజు, నాయకులు దుసరి మధుగౌడ్, జయపాల్ రెడ్డి, అరుణ్ గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.