calender_icon.png 18 September, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'బిల్డ్ నౌ' ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

03-12-2024 04:26:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భవన, లే అవుట్ల అనుమతులకు కొత్త ఆన్ లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చింది. "బిల్డ్ నౌ" ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నమని, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటి నెరవేరుస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. స్థిరాస్తి రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ ప్రజలే గృహరుణాలు అధికంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నందున సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టి పెట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.