calender_icon.png 2 February, 2026 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమన్న ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు

02-02-2026 12:00:00 AM

నిర్మల్ ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో భీమన్న జాతర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి హాజరయ్యారు. గ్రామస్తులు, నాయక్ పోడ్ కులస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భీమన్న దేవుని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నియో జకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.