02-02-2026 12:00:00 AM
ఉట్నూర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సమేతంగా వనదేవతలైన సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నారు. శనివారం రాత్రి మేడారం లోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరమ్మలకు ప్రత్యేక పూజ లు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ వన దేవతలను వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందుకు వనదేవతలు ఉ మ్మడి జిల్లా ప్రజలపై ఆశీస్సులు ఉంచాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.