8 June, 2026 | 6:09 PM

Breaking News

10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •   కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం   •  

కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై హైకోర్టు నోటీసులు

16-07-2024 01:15 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నాంపల్లిలోని 45వ వార్డు పార్కు స్థలంలో ప్రైవేటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడంపై జీహెచ్‌ఎంసీకి సోమవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. నాంపల్లి సర్వే నం.24లో పార్కును ధ్వంసం చేసి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ షాహినాథ్ గంజ్‌కు చెందిన రహీం బిన్ హుస్సేన్ పిల్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. పార్కు స్థలంలో డీ హనుమదాస్ అనే వ్యక్తి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. దీనిపై అధికారులకు రెండు సార్లు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రతివాదులైన జీహెచ్‌ఎంసీ కమిషనర్, సహాయ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్, నాంపల్లి తహశీల్దార్, షాహినాథ్‌గంజ్ ఇన్స్పెక్టర్, డీ హనుమాన్ దాస్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.