14 July, 2026 | 6:27 PM

Breaking News

తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •  

రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు

08-06-2026 05:44 PM

రామాయంపేట,(విజయ క్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వార్డులలో సోమవారం వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజల చెవులో పూలు పెట్టిన విధంగా ఉన్నాయని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఇక్కడ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పాటు పట్టణంలో కూడా అదేవిధంగా చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. స్పందించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతర వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అసమర్థత కారణంగా తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందని అప్పటి నాయకుల అవినీతి అసమర్థత పాలన వల్లే నేడు ఈ ఆర్థిక దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.