24-12-2025 03:17:34 PM
హైదరాబాద్: మియాపూర్ పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. కొంతకాలంగా దంపతుల మధ్య వివాదం కొనసాగుతోంది. జల్సాలకు అలవాటు పడ్డ భర్త తీరు మార్చుకోవాలని భార్య కోరింది. నిన్న వాగ్వాదం తర్వాత అత్తింటికి వెళ్లేందుకు భార్య సిద్ధమైంది. మార్గం మధ్యలో భార్య విజయలక్ష్మిని అడ్డగించిన భర్త రాజు ఆమెతో గొడవపడ్డాడు. భర్త పిడిగుద్దలతో దాడి చేయడంతో విజయలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేశారు.