27-11-2025 11:54:58 AM
గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది. హైకోర్టు సీజే ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2015 గ్రూప్-2 రాంకర్లకు ఊరట లభించింది. 2015 గ్రూప్-2 నియామకాలు రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు.