27-11-2025 11:07:31 AM
హైదరాబాద్: గ్రూప్-2పై దాఖలైన అప్పీలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరుగుతోంది. 2019లో గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును కిరణ్ కుమార్ సవాల్ చేశారు. పిటిషన్ పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ నగేశ్ బీమపాక 2019లో చేసిన గ్రూప్-2 నియామకాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని పిటిషన్ అప్పీలు దాఖలు చేశారు.