27-11-2025 10:39:42 AM
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ అయ్యప్పసొసైటీలో(Madhapur Ayyappa Society) డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 14 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూయర్ వేడుకల కోసం నిందితులు బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుపై గతంలోనూ డ్రగ్స్ కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డ్రగ్స్ ముఠాలు ఎక్కడ ఎక్కడ పట్టుబడుతూనే ఉన్నాయి.