calender_icon.png 27 November, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

27-11-2025 12:43:17 PM

హైదరాబాద్: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు(Panchayat elections) నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 29 వరకు తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. తొలిదశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కించి వార్డు, సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 12,760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(Telangana State Election Commission) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.

నామినేషన్ షెడ్యూల్:

• మొదటి దశ నామినేషన్లు – నవంబర్ 27 నుంచి

• రెండో దశ నామినేషన్లు – నవంబర్ 30 నుంచి

• మూడో దశ నామినేషన్లు – డిసెంబర్ 3 నుంచి

పోలింగ్ తేదీలు:

• మొదటి దశ – డిసెంబర్ 11

• రెండో దశ – డిసెంబర్ 14

• మూడో దశ – డిసెంబర్ 17